: కూలిన గోడ.. 8 మంది సజీవ సమాధి
హైదరాబాదులోని మౌలాలీలో గోడ కూలి ఆరుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే రాజస్థాన్ లోని భరత్ పూర్లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. భరత్ పూర్-ఆగ్రా 11వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో నిర్మాణ స్థలం వద్ద మట్టిగోడ కుప్పకూలి మీద పడిపోవడంతో.. 8 మంది సజీవ సమాధి అయ్యారు. మృతులలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అడిషనల్ ఎస్పీ రాజేశ్ యాదవ్ తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోకు చెందిన వారని, ప్రమాద సమయంలో భూమికంటే లోతైన నిర్మాణ స్థలంలో కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు.