: ఆంధ్రప్రదేశ్ కు హెరిటేజ్ హోదా: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ లో 400 ఏళ్ల నాటి పురాతన కట్టడాలు ఉన్నాయని, ఈ దిశగా, రాష్ట్రానికి హెరిటేజ్ హోదా కల్పిస్తామని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి అన్నారు. ఇప్పటికే 16 రాష్ట్రాలు హెరిటేజ్ హోదాను పొందాయని చెప్పారు. 'క్లీన్ ఇండియా' ప్రచార కార్యక్రమాన్ని ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద చిరంజీవి బుధవారం ప్రారంభించారు. దేశంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం కల్పించి మరింత మంది సందర్శకులను ఆకర్షించడం కోసమే 'క్లీన్ ఇండియా' ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 36 కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని చిరంజీవి చెప్పారు. 'క్లీన్ ఇండియా' కార్యక్రమాన్ని తొలిసారిగా గతేడాది జూన్ 19న పర్యాటక శాఖ కుతుబ్ మినార్ వద్ద ప్రారంభించింది. తాజాగా దీన్ని తాజ్ మహల్ వద్ద చేపట్టారు.