: నేటితో ముగియనున్న బెంగాల్ పంచాయతీ రచ్చ
పశ్చిమ బెంగాల్ లో హింసాత్మకంగా రూపుదాల్చిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియనుంది. గత నెల రోజులుగా పలు గ్రామాలను అట్టుడికించిన పంచాయతీ ఎన్నికలు నేటితో పరిసమాప్తం కానున్నాయి. ఈ రోజు జరుగుతున్న ఐదో దశ పోలింగ్ లో సుమారు 65 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తర, దక్షిణ దినాజ్ పూర్, కూచ్ బీహార్, జల్పాయ్ గురి జిల్లాల్లో 8 వేల కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. నాలుగోవిడత ఎన్నికల సందర్భంగా ఏడుగురు మృతి చెందడంతో, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.