: మోడీకి వీసాపై అమెరికా స్పందన
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి వీసా జారీ చేసే విషయమై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. వీసాకోసం మోడీ దరఖాస్తు చేసుకుంటే, తమ దేశం ఇమిగ్రేషన్ చట్టాలు, నియమాల పరిధిలో ఆయన వీసా అర్హతను పరిశీలిస్తామని ఆ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి తాజాగా మీడియాకు తెలిపారు.
అయితే, వీసా విషయంలో అమెరికా విధానాలేమీ మారలేదని చెప్పిన ఆమె, వ్యక్తుల్ని బట్టి తీసుకునే విధాన నిర్ణయాల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. మరోవైపు మోడీకి వీసా ఇవ్వొద్దంటూ కొన్ని రోజుల కిందట 65 మంది భారత ఎంపీలు అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖ దుమారం రేపుతోంది.