: మాటమార్చిన మంత్రి శైలజానాథ్


రాష్ట్ర విభజన అనివార్యమైతే తాము పదవులకు రాజీనామా చేస్తామని నిన్న పేర్కొన్న మంత్రి శైలజానాథ్ నేడు మాటమార్చారు. నేడు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, బుధవారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన సమావేశంపై వివరణ ఇచ్చారు. తాము రాజీనామాల విషయం చెప్పలేదంటూ, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మాత్రమే పేర్కొన్నామని తెలిపారు. సమైక్యవాదాన్ని మరింత గట్టిగా వినిపించేందుకు త్వరలో హస్తిన వెళ్ళాలని నిర్ణయించుకున్నామని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ గా వ్యవహరిస్తున్న శైలజానాథ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News