: సీమాంధ్ర నేతలను తెలంగాణలో అడుగుపెట్టనివ్వం: గుత్తా


విభజన రాజకీయం మరింత వేడెక్కింది. నిన్న సీమాంధ్ర మంత్రులు సమావేశమై అవసరమైతే రాజీనామాలు చేయాలని తీర్మానించగా.. తెలంగాణ నేతలూ దీటుగా స్పందించారు. రాష్ట్ర సాధనకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, విభజనకు అడ్డుతగిలే సీమాంధ్ర నేతలు తెలంగాణలో ఎలా తిరుగుతారంటూ ప్రశ్నించారు. ఇక, ఇదే విషయమై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, సీమాంధ్ర ఎంపీలు బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News