: బ్రిటన్ రాకుమారుడికి పేరు పెట్టారు
ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్ టన్ దంపతులకు జన్మించిన తొలి సంతానానికి 'జార్జ్ అలెగ్జాండర్ లూయిస్' అని నామకరణం చేశారు. ఈ మేరకు కెన్సింగ్టన్ ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. విలియం దంపతులకు, రాణి ఎలిజబెత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిటన్ రాయల్ కుటుంబంలోని మూడవతరం వారసుడైన రాకుమారుడు వారసత్వపరంగా 'ప్రిన్స్ జార్జ్ ఆఫ్ కేంబ్రిడ్జి'గా గుర్తింపు పొందనున్నాడు.