: స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 60 మంది మృతి


స్పెయిన్ లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. 60 మంది మృతి చెందగా,70మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. 13 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గత 4 దశాబ్దాల కాలంలో ఇదే అత్యంత ఘోర ప్రమాదమని స్పెయిన్ వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో రైలులో 218 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనఫై స్పెయిన్ ప్రధాని ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News