: షుగరుంటే ఇలా కూడా ఇబ్బందే


మీకు షుగరుందా... అయితే మీరు మరింతగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షుగరు వ్యాధిగ్రస్థులకు అంగవైకల్యం వచ్చే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. షుగరు వ్యాధి ఉండేవారు వయసు మీదపడేకొద్దీ పలు రకాలైన సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, అందునా అంగవైకల్యం వచ్చే ప్రమాదం మరింతగా ఉంటుందని వీరు చెబుతున్నారు.

ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అన్నా పీటర్స్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందుకోసం వీరు 65 ఏళ్లకు పైబడిన వారిని ఎంపిక చేసుకుని వారిపై అధ్యయనాన్ని నిర్వహించారు. వీరు నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమంటే షుగరు వ్యాధి ఉండే వృద్ధులకు అంగవైకల్యం వచ్చే ప్రమాదం మిగిలినవారితో పోల్చుకుంటే 80 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే టైప్‌1, టైప్‌2 మధుమేహ బాధితులకు మధ్య తేడాలను గురించి వీరు వెల్లడించనప్పటికీ ప్రధానంగా టైప్‌2 మధుమేహం ఉన్న వారిపైనే వీరు అధ్యయనాన్ని నిర్వహించారు.

ఈ అంగవైకల్యాన్ని రెండు రకాలుగా వీరు నిర్వచించారు. కదలికలు లేకపోవడం, దైనందిన కార్యక్రమాలను చేసుకోలేకపోవడం. షుగరు లేనివారికంటే కూడా ఉన్న వృద్ధుల్లో ఇలా అంగవైకల్యం ముప్పు 50 శాతం నుండి 80 శాతం వరకు అధికంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. అయితే అంగవైకల్యానికీ, మధుమేహానికి ఎలాంటి సంబంధం ఉంది అనే విషయం గురించి ఇంతవరకూ తెలుసుకోలేకపోతున్నామని అన్నా పీటర్స్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News