: కార్ల గురించి ఇంతకన్నా ఎవరికి తెలుసుంటుంది!


కార్ల గురించి మనకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది. అయితే ఈ పరిజ్ఞానం ఏ కొద్ది కార్లకు సంబంధించిందో వుంటుందేకానీ... ఏకంగా ఓ రెండువందల కార్లకు సంబంధించిన పరిజ్ఞానం ఉండడం అంటే సామాన్య విషయం కాదు. అందునా చిన్న వయసులో కార్లకు సంబంధించిన పరిజ్ఞానం ఉండడం అంటే ఇక అది అద్భుతమే అని చెప్పాలి.

చెన్నైకి చెందిన ఆరేళ్ల ఎస్‌.లక్షిన్‌కు కార్లంటే చిన్నతనం నుండే మహా ఇష్టం. ఈ ఇష్టం అతగాణ్ని ఎంతలా తయారు చేసిందంటే ఏదైనా కారు మోడల్‌ గురించి ఇలా చిన్న వివరం చెప్పామంటే ఠక్కున ఆ కారు ఏ మోడల్‌కు సంబంధించింది అనే విషయాన్ని చెప్పేస్తాడు. ఇలా ఒకటి రెండు కాదు... ఏకంగా 210 కార్లకు సంబంధించిన మోడళ్లను గురించి లక్షిన్‌ చక్కగా చెప్పేస్తాడు. ఆరు నిముషాల 45 సెకండ్ల వ్యవధిలో కారును గుర్తుపట్టేసి, ఆ కారు పేరు చెప్పేసి చూసేవాళ్లు నోరు తెరిసేలా చేసేస్తాడు. ఇలా ఏదైనా కారు గురించి చెప్పేసే అతడి ఆసక్తి బుధవారం నాడు చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆహూతులను ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ కార్యక్రమంలో లక్షిన్‌ ఏకంగా అక్కడున్న 210 రకాలకు చెందిన కార్లను, వాటి మోడల్స్‌ను గుర్తుపట్టేసి తడబడకుండా చక్కగా చెప్పేశారు. దీంతో ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఆహూతుల వంతయింది.

  • Loading...

More Telugu News