: చర్మసౌందర్యానికో చిట్కా


మీ చర్మం చక్కగా నిగారించాలనుకుంటే మాత్రం ఇది మీకు తెలియాల్సిందే. ఏమంటే చర్మం చక్కగా మెరుస్తూ వయసు తెలియకుండా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా చక్కగా కంటినిండా నిద్రపోవడమే. దీంతో మీ చర్మం వయసు తెలియనివ్వనంతగా మెరుస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. వీరు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో చక్కగా నిద్రపోయేవారి చర్మం చక్కగా ఆరోగ్యవంతంగా మెరుస్తుందని తేలింది.

అమెరికాలోని యూనివర్సిటీ హాస్పిటల్స్‌ కేస్‌ మెడికల్‌ సెంటర్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో చక్కగా నిద్రపోయేవారి చర్మం వార్ధక్యాన్ని దూరంగా ఉంచుతుందని తేలింది. అంటే వార్ధక్యపు ఛాయలు చర్మంపై అంతగా తెలియకుండా మనకు నిద్ర మేలుచేస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. తగినంతగా నిద్రపోనివారిలో చర్మం తొందరగా ముడతలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని, అలాగే ఎండ ప్రభావానికి గురయ్యాక చర్మం తిరిగి మామూలు స్థాయికి రావడం తగ్గుతున్నట్టుగా ఈ పరిశోధనలో తేలింది.

ఇందుకోసం శాస్త్రవేత్తలు కొందరు మహిళలను ఎంచుకొని చర్మం వయసును లెక్కించే మార్కుల ఆధారంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో కంటినిండా నిద్రపోయేవారికి 2.2 మార్కులు రాగా, నిద్రలేమితో బాధపడేవారికి 4.4 మార్కులు వచ్చాయి. అయితే ఎన్ని మార్కులు ఎక్కువగా వస్తే వారి చర్మం అంతగా దెబ్బతింటుందని దీని అర్థం. తగినంతగా నిద్రపోని వారిలో చర్మం వదులు కావడంతోబాటు వారి చర్మపు రంగులో తేడాలు, సాగేగుణం తగ్గటం వంటివి కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఇలా నిద్రలేమితో బాధపడేవారిలో తాము ఆకర్షణీయంగా ఉన్నామనే భావన కూడా తగ్గుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News