: భారత్ 'అంగారక యాత్ర' ఓ పబ్లిసిటీ స్టంట్: ఇస్రో మాజీ చీఫ్


చంద్రయాన్ పేరిట దేశ అంతరిక్ష రంగంలో మరుపురాని విజయాన్నందించిన ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్.. భారత రోదసీ కార్యక్రమాలపై భిన్నగళం వినిపిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 'అంగారక యాత్ర' ఓ పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించారు. బెంగళూరులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఆ రోదసీ యాత్రను అర్థంపర్థంలేని పరిశోధనగా కొట్టిపారేశారు. అంగారకుడికిపైకి యాత్ర సాగిస్తే, రూ.450 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుకావడం తథ్యమని హెచ్చరించారు. కాగా, ఇస్రో చీఫ్ గా నాయర్ వ్యవహరించిన కాలంలో భారత్ 20కి పైగా అంతరిక్ష కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. వాటిలో చంద్రయాన్-1 ప్రముఖమైనది.

  • Loading...

More Telugu News