: సమైక్యమే ముద్దు... అవసరమైతే రాజీనామాలు: శైలజానాథ్


అవసరమైతే రాజీనామాలకు తాము వెనుకాడమని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. హైదరాబాద్ లోని మంత్రుల ప్రాంగణంలో సమావేశమైన సీమాంధ్ర మంత్రులు తమకు సమైక్యం తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదన్నారు. రాష్ట్ర విభజనపై వేసిన కమిటీలేవీ విభజనే పరిష్కారం అని చెప్పలేదని గుర్తు చేశారు. అభివృద్ధి ప్రధానాంశంగా విభజన జరిగితే పర్వాలేదు, కానీ పరిపాలన సాగించుకుంటామనడానికి ఇక్కడ రాజరికపు వ్యవస్థ లేదని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో దేశ సమైక్యతకు నష్టం కలిగేలా విభజన సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అవసరమైతే రాజీనామాలకు కూడా వెనుకాడబోమని తెలిపారు.

ఇందులో సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూస్తామని మంత్రి శైలజానాథ్ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీకి వాటిల్లే నష్టాన్ని కూడా అధిష్ఠానానికి వివరిస్తామని ఆయన తెలిపారు. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానం పెద్దలతో తమ అభ్యంతరాన్ని తెలుపుతామని ఆయన అన్నారు. ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ద్వారా తమ వాదనను హైకమాండ్ కు విన్నవిస్తామని శైలజానాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News