: అరంగేట్రంతోనే అదరగొట్టిన రాయుడు.. సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. భారత్ విన్


టీమిండియాలో చోటుకోసం చకోరపక్షిలా ఎదురుచూసిన అంబటి రాయుడు దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కెరీర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రాయుడు సమయోచిత ఆటతీరు ప్రదర్శించి అర్ధసెంచరీ నమోదు చేశాడు. తన జూనియర్లంతా తన కంటే ముందుగానే భారత జట్టులోకి వచ్చి సత్తా చాటగా తను మాత్రం వారికంటే వెనకబడ్డాడు. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జారవిడుచుకోరాదన్న తపన రాయుడి బ్యాటింగ్ లో కనిపించింది.

మందకొడి పిచ్ పై కెప్టెన్ కోహ్లీకి చక్కని సహకారమందిస్తూ ఏమాత్రం ఆదుర్దా లేకుండా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ మాత్రం సాధికారక ఆటతీరుతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వంద సగటుతో సెంచరీ సాధించి సత్తా చాటాడు. కోహ్లీ వన్డే కెరీర్లో ఇది 15వ శతకం.మరో 13 పరుగులు జోడించిన కోహ్లీ(113) ఉత్సెయ వేసిన ఫుల్ టాస్ ను బౌండరీకి తరలించే ప్రయత్నంలో సిబంద చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రైనా వస్తూనే ఉత్సెయ వేసిన బంతిని తరలించబోయి ఎక్సట్రా కవర్ వద్ద సికిందర్ రాజాకి డకౌట్ గా చిక్కాడు. అనంతరం దినేష్ కార్తిక్(8 నాటౌట్)అండగా రాయుడు(64 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. దీంతో టీమిండియా 44.5 ఓవర్లలో 230 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కెప్టెన్ కోహ్లీ నిలిచాడు.

  • Loading...

More Telugu News