: ఎన్నికల తరువాతే మూడో కూటమి: కారత్
2014 ఎన్నికలకు ముందు మూడో కూటమి ఏర్పాటు ఉండదని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ తేల్చి చెప్పారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన సార్వత్రిక ఎన్నికల తరువాతే మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలకు భిన్నంగా ఈ కూటమి ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నాయకులు మూడో కూటమి ఏర్పాటుకు అనుకూలంగా ఉండడం విశేషం.