: 23 మంది విద్యార్థుల మృతికి కారణమైన ప్రిన్సిపాల్ లొంగుబాటు


మధ్యాహ్న భోజనం కలుషితమై 23 మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలో, ఆరోపణలెదుర్కొంటున్న చాప్రా పాఠశాల ప్రిన్సిపల్ మీనాదేవి ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోయింది. కాగా, ఆమె భర్త అర్జున్ రాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. లొంగిపోవడానికి ముందు ఆమె తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక అధికారులు తాళం వేసిన ఆమె ఇంటికి ఈ రోజే కోర్టు నోటీసులు అంటించారు. మరో వైపు బీహార్ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం మొత్తం రాష్ట్రంలో జూలై 26 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News