: ప్రారంభమైన సీమాంధ్ర మంత్రుల సమావేశం
హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో సీమాంధ్ర మంత్రుల సమావేశం ప్రారంభమైంది. భవిష్యత్ కార్యాచరణ, త్వరలో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సభపై చర్చించేందుకు వీరు భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి మొత్తం 19 మంది సీమాంధ్ర మంత్రులు హాజరయ్యారు. ఇదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించారు. అయితే, ప్రాంగణం బయట పోలీసులు వారిని చెదరగొట్టారు.