: ముఖ్యమంత్రి లెక్కల్లో కాంగ్రెస్ దే అగ్రస్ధానం


తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తమ వద్ద ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 1965 స్ధానాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచారని కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి తెలిపారు. తర్వాతి స్ధానాల్లో టీడీపీ మద్దతుదారులు 1893 స్ధానాల్లో గెలుపొంది ద్వితీయస్థానాన్ని కైవసం చేసుకోగా, 1457 స్థానాలు గెలుచుకుని వైఎస్సార్సీపీ తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. కేవలం 474 స్థానాలు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఆ తరువాతి స్ధానాన్ని పొందినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాగా ఈ లెక్కల ప్రకారం ఏడు జిల్లాల్లో కాంగ్రెస్ సత్తా చాటితే, ఎనిమిది జిల్లాల్లో టీడీపీ తానేంటో నిరూపించుకుంది. రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం చూపితే, నాలుగు జిల్లాల్లో టీఆర్ఎస్ సత్తా చాటుకుంది.

  • Loading...

More Telugu News