: ములాయం ఆస్తుల కేసు మూసివేయట్లేదు: సీబీఐ
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆస్తుల కేసు మూసి వేయట్లేదని సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరు లీక్ చేశారో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించామని తెలిపారు. ములాయం, ఆయన కుమారుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్న విచారణను సీబీఐ త్వరలో మూసివేస్తోందంటూ వివిధ వార్తా సంస్థల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.