: ఎస్ఐ ఉద్యోగానికి కోచింగ్ కోసం వచ్చి ఇద్దరి మృత్యువాత
అప్పుడే అల్పాహారం ముగించి హోటల్ బయటికి వచ్చిన ఆ స్నేహితులిద్దరికి తెలియదు, కొన్ని క్షణాల్లో తమను మృత్యువు కబళించపోతోందని! ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నారో లేదో ఇంతలో పెద్ద విస్ఫోటనం!
అప్పటి దాకా కలిసి తిరిగిన ఆ మిత్రులు చావులోనూ కలిసే ఉండడం చూపరులను కలిచివేసింది. ఎస్ఐ కోచింగ్ కోసమని హైదరాబాద్ వచ్చిన వారిరువురు వరుస పేలుళ్ల ఘటనలో అసువులు బాశారు. వారు ఆదిలాబాద్ కొల్లూరుకు చెందిన ముత్యాల రాజశేఖర్, వడ్డే విజయ్ కుమార్ గా భావిస్తున్నారు.