: ప్రపంచ పుస్తక ప్రదర్శన రేపటి నుంచే
ప్రపంచ పుస్తక ప్రదర్శన డిల్లీలోని ప్రగతి మైదాన్ లో రేపు ప్రారంభం కానుంది. 10వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. ఈ ప్రదర్శనను మానవ వనరుల సహాయ మంత్రి శశి థరూర్ ప్రారంభిస్తారు. పుస్తక ప్రియుల కోసం ఇందులో 2,100 షాపులు తెరుచుకోనున్నాయి. 23 దేశాలకు చెందిన పుస్తక ప్రదర్శకులు, 100 భాషలకు చెందిన పబ్లిషర్లు ఇందులో పాల్గొంటున్నారు. జానపద, గిరిజన సాహిత్యానికి చెందిన ప్రత్యేక పుస్తకాలను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు. పలు చర్చా గోష్టులు కూడా వుంటాయి.