: విచారణకు హాజరైన ధిక్కార ఎమ్మెల్యేలు
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో పార్టీ జారీ చేసిన విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలు నేడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరిని తన కార్యాలయంలో స్పీకర్ విచారిస్తున్నారు. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీడీపీ విప్ ధూళిపాళ్ల నరేంద్ర న్యాయవాది సహా సభాపతి ముందు విచారణకు వచ్చారు. కాగా, వ్యక్తిగత కారణాల వల్ల వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం అందించారు.