: అమీర్ ఖాన్ ఇంటి అద్దె నెలకు పదిలక్షలట!


మనకు తెలిసి ఇంటి అద్దెలు ఎంత ఉంటాయి..! వెయ్యి రూపాయలు మొదలుకొని పదివేలు.. మరీ పెద్ద ఫ్లాటు అయితే రూ.20 వేల వరకు ఉంటాయని తెలిసిందే. కానీ, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తన ఇంటికి ఎంత అద్దె చెల్లిస్తున్నాడో వింటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ముంబై బాంద్రాలోని బీచ్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లాట్ కు అక్షరాలా రూ.10 లక్షలు చెల్లిస్తున్నాడట. ఇన్నాళ్ళ నుంచి సినీ ఫీల్డ్ లో ఉన్న అమీర్ ఖాన్ కు స్వంత ఇల్లు లేదా? అని సందేహం రావొచ్చు. పాల్ హిల్స్ ప్రాంతంలో ఖరీదైన స్వంత నివాసం ఉన్నా.. దానికి మరమ్మతులు చేయిస్తుండడంతో ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నాడు అమీర్ ఖాన్. ఇంత ఖరీదైన ఇల్లెందుకని అమీర్ ప్రశ్నిస్తే.. స్థాయికి తగ్గట్టు ఉండాలని ఆయన భార్య కిరణ్ రావే బాంద్రా ఫ్లాట్ ను ఎంపిక చేసిందట. అదండీ, అమీర్ ఖాన్ పది లక్షల రెంటు కథ!

  • Loading...

More Telugu News