: ఆఫ్ఘన్, మయన్మార్ మహిళలకు 'రామన్ మెగసెసె'
ఇద్దరు మహిళలను ఈ ఏడాది 'రామన్ మెగసెసె' పురస్కారం వరించనుంది. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన తొలి, ఏకైక మహిళా గవర్నర్ హబీబా సరాబీకి, మయన్మార్ కు చెందిన సంఘసేవకురాలు లాపాయ్ సెంగ్ రా కు ఈ అవార్డు అందజేయనున్నట్టు ఫిలిప్పీన్స్ వర్గాలు ప్రకటించాయి. హబీబా సరాబీ.. ఆఫ్ఘన్ లో మెరుగైన స్ధానిక పాలన అందించడానికి, మహిళల విద్య, హక్కుల కోసం కృషి చేస్తోండగా.. లాపాయ్ సెంగ్ రా మయన్మార్ లో అంత:కలహాల వల్ల నష్టపోతున్న వర్గాల పునరావాసానికి పాటు పడుతోంది. వీరిద్దరి కృషిని గుర్తించిన అవార్డు కమిటీ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.