: కాగ్ నియామకంపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా శశికాంత్ శర్మ నియామకంపై దాఖలైన వ్యాజ్యాలపై స్పందనను తెలియజేస్తూ ఆగస్టు 8వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగ్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి బి.డి.అహ్మద్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేసింది.