: నాపై అభియోగాలు కొట్టేయరూ..: సుప్రీంకు కనిమొళి


2జీ స్పెక్ట్రం కేసులో తనపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి నేడు సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2 జీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్టు కనిమొళి ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా అరెస్టై కొంతకాలం జైలులో ఉండి బెయిలుపై విడుదలయిన సంగతి తెలిసిందే. కనిమొళిపై అభియోగాలు డీఎంకే పార్టీకి ప్రతికూలంగా మారిన సంగతి కూడా విదితమే.

  • Loading...

More Telugu News