: నాపై 'రెబల్' ముద్రవేయడం అన్యాయం: జ్వాల
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ నిర్వాహకులపై హైదరాబాద్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి గళమెత్తారు. వేలం తీరుతెన్నులను ప్రశ్నించింనందుకు తనపై 'రెబల్' అని ముద్ర వేయడం తగదన్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఐబీఎల్ లో తన కనీస ధరను మరింత తగ్గించడం అన్యాయమన్నారు. దానికి తోడు రెబెల్ అని పేర్కొనడం దారుణమని వాపోయారు. డబుల్స్ విభాగంలో ఇప్పటికే తాను పలు అంతర్జాతీయ టైటిళ్ళు నెగ్గానని, ఏ టోర్నీ నిర్వాహకులతోనూ వివాదాల్లేవని చెప్పుకొచ్చారు. టోర్నీ స్థాయి ఏదైనా అంకితభావం ప్రదర్శించానన్నారు. కాగా, జ్వాలకు సోమవారం జరిగిన ఐబీఎల్ వేలంలో రూ.18 లక్షల ధర పలికిన సంగతి తెలిసిందే.