: డాక్టర్ ను చంపి.. కొరియర్ చేసిన కి'లేడీ'


ఈ లేడీ పెద్ద కిలాడీ. తనతో హోటల్ కు వచ్చిన డాక్టర్ ను హతమార్చడమే కాకుండా, మర్మాంగాన్ని కోసి అతడి భార్యకే పార్శిల్ చేసింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పట్టణంలో ఈ భయంకర ఘటన జరిగింది. సతీష్ చంద్ర అనే డాక్టర్ కాన్పూర్ సమీపంలోని అమ్రోద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం కాన్పూర్ లోని రానియా ప్రాంతంలో ఒక హోటల్లో శవమై కన్పించారు. అదే సమయంలో కొరియర్ ఆఫీసు నుంచి పోలీసులకు ఒక సమాచారం అందింది. రక్తపు మరకలు అంటిన ప్యాకెట్ ను కొరియర్ సిబ్బంది పోలీసులకు అందించారు. దీనిని 20ఏళ్ల యువతి బుక్ చేసిందని, డాక్టర్ నివాసానికి చేర్చాలని కోరినట్లు తెలిపారు. ఫోన్ నంబర్ కోరగా, ఆమె తప్పుడు నంబర్ ఇచ్చింది. అయితే, ఈ యువతే హోటల్లో డాక్టర్ ను హత్య చేసి అతడి మర్మాంగాన్ని భార్యకు కొరియర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News