: ఉల్లి ధరల పెరుగుదల తాత్కాలికమే: పవార్
ఉల్లి ధరల పెరుగుదల తాత్కాలికమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర తదితర ఉల్లి పండే రాష్ట్రాలలో వర్షాలు పడడం వల్లే సరఫరాపై ప్రభావం పడిందని చెప్పారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వీటిని అదుపు చేయడానికి తక్షణమే ఎగుమతులపై నిషేధం విధించాలని వస్తున్న డిమాండ్లను శరద్ పవార్ తోసిపుచ్చారు. ఉల్లి ఎగుమతులపై నిషేధానికి సుముఖంగా లేనని స్పష్టం చేశారు. ఇలా చేస్తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ మసకబారుతుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి ఏదైనా ఎగుమతులపై నిషేధం సరికాదన్నారు.