: నటుడు మనోజ్ కుమార్ కు నేడు గాల్ బ్లాడర్ ఆపరేషన్


బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ కు ఈ సాయంత్రం వైద్యులు గాల్ బ్లాడర్ (పిత్తాశయ శస్త్ర చికిత్స) ఆపరేషన్ చేయనున్నారు. అనారోగ్యం కారణంగా రెండు రోజుల కిందట మనోజ్ కుమార్ ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు శస్త్రచికిత్స తప్పనిసరి అని నిర్ణయించారు. కాగా, మనోజ్ కుమార్ ఈ రోజు 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

  • Loading...

More Telugu News