: పాతబస్తీలో డంప్ స్వాధీనం.. ఉగ్రవాదులదేనా ?
భారత నిఘా విభాగం చేసిన హెచ్చరికలతో తనిఖీలు చేపట్టిన పోలీసులు అవాక్కయ్యేలా భారీ డంప్ హైదరాబాద్ పాతబస్తీలో లభించింది. అందులో 400 జిలెటిన్ స్టిక్స్ తో పాటు 250 డిటోనేటర్లు లభించాయి. వీటికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్ స్టేషన్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. అయితే ఇవి ఉగ్రవాదులవా? లేక, మరెవరికైనా చెందినవా? అనే అంశాలను పోలీసులు నిగ్గు తేల్చనున్నారు.