: బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే పొడవైన వంతెన
దేశంలోనే పొడవైన వంతెన అసోంలోని బోగిబీల్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మితం కానుంది. 4.94 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు-రోడ్డు వంతెన 2016 నాటికి పూర్తి కాగలదని అంచనా. ఇది పూర్తయితే ఎగువ అసోం, అరుణాచల్ ప్రదేశ్ కు ప్రయాణం సులువు అవుతుంది. చైనా సరిహద్దులకు వెళ్లడానికి 10 గంటల సమయం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ నదిని బోటులో దాటడానికి గంటన్నర సమయం పడుతుండగా.. కొత్త వంతనె పూర్తయితే అది నిమిషాల్లోనే దాటేయవచ్చు. అయితే, ఇప్పుడు ఈ నదిని దాటించడానికి బోట్లు నడుపుతూ పొట్టపోసుకుంటున్న 100 మందికి మాత్రం ఉపాధి కరవవుతుంది.