: బ్రిటన్ లార్డ్స్ కమిటీ చైర్మన్ గా భారతీయ వైద్యుడు


'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని ... నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..' అన్న రాయప్రోలు సుబ్బారావు వ్యాఖ్యలను భారతీయులు నిజం చేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం, వృత్తి రీత్యా విదేశాలకు వెళ్లిన భారతీయులు తమ ప్రతిభతో దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నారు. తాజాగా, బ్రిటిష్ పార్లమెంటులో ఎగువ సభ 'హౌస్ ఆఫ్ లార్డ్స్' కు స్వతంత్ర సభ్యులను ఎన్నుకునే అత్యున్నత కమీషన్ కు భారత సంతతి వైద్యుడు అజయ్ కక్కర్ చైర్మన్ గా నియమితులయ్యారు. కక్కర్ నియామకాన్ని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు.

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో శస్త్రచికిత్సల ఆచార్యుడిగా పనిచేస్తున్న అజయ్ కక్కర్ రక్తనాళాలు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ తో కూడిన త్రాంబోసిస్ వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 'హౌస్ ఆఫ్ లార్డ్స్' నియామక కమీషన్ సభ్యుడిగా పని చేశారు. తాజాగా అదే కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీ.. ఎగువ సభకు స్వతంత్ర సభ్యులను ఎంపిక చేయడంతో పాటు, వివిధ పార్టీల తరపున లార్డ్స్ సభ్యత్వం కోసం కమిటీకి వచ్చే దరఖాస్తులను పరిశీలిస్తుంది.

  • Loading...

More Telugu News