: '108' సర్వీసుల్లోకి కొత్తవారిని తీసుకుంటాం: జీవీకే
వేతన పెంపు కోసం సమ్మె చేస్తున్న '108' అత్యవసర సేవల సిబ్బంది వెంటనే విధుల్లోకి చేరాలని, లేకుంటే వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని జీవీకే యాజమాన్యం హెచ్చరిక జారీ చేసింది. ఎస్మా చట్టం అమల్లో ఉన్నందున సిబ్బంది సమ్మె చేయరాదని స్పష్టం చేసింది. మరోవైపు, 80 శాతం అంబులెన్సులు యథావిధిగా పనిచేస్తున్నాయని జీవీకే ఈఎంఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధార్థ భట్టాచార్య చెప్పారు. రెండు రోజుల్లో అన్ని అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.