: 73 మంది ఖైదీలకు మయన్మార్ క్షమాభిక్ష
దేశంలోని వివిధ జైళ్లలో మగ్గిపోతున్న 73 మంది ఖైదీలకు మయన్మార్ ప్రభుత్వం నేడు విముక్తి కలిగించింది. ఈమేరకు ఆ దేశ అధ్యక్షుడు ఖైదీల విడుదలకు సంబంధించిన క్షమాభిక్ష పత్రంపై సంతకం చేశారని 'జిన్హువా' పత్రిక వెల్లడించింది. ఇదే సంవత్సరం మే నెలలో 25 మంది ఖైదీలను కూడా క్షమాభిక్ష కిందే ప్రభుత్వం విడుదల చేయగా, 2011 మార్చిలో మయన్మార్ పౌర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకు పెద్దసంఖ్యలో ఖైదీలను విడుదల చేసినట్లు 'జిన్హువా' పేర్కొంది.