: మళ్లీ కాంగ్రెస్ పార్టీదే అధికారం, నేను సమైక్యవాదినే: బొత్స
రాష్ట్రంలో 2014లో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ దే అధికారమని, అందుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. (ఏకగ్రీవాలతో కలిపి) మొత్తం 2,700 మంది కాంగ్రెస్ మద్దతు దారులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారని ఆయన చెప్పారు. ఈమేరకు బొత్స హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లేసిన ఓటర్లందరికీ బొత్స కృతజ్ఞతలు తెలిపారు. ముందస్తు ఎన్నికలు ఉండబోవని అభిప్రాయపడ్డారు. తాను సమైక్యవాదాన్నే కోరుకుంటున్నానని చెప్పారు.