: తెలంగాణలో భారీవర్షాలకు అవకాశం
బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఈ అల్పపీడన ప్రభావం వ్యాపించి ఉంది. దాంతో, రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు జల్లులు పడతాయని పేర్కొంది. అటు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.