: సంజయ్ దత్ ఎంతో మంచి వారు: ప్రాచీ దేశాయ్


సంజయ్ దత్ ఎంతో వినయంగల వారని, ఆయనో మంచి మనిషి అని పొగిడేస్తోంది కథానాయిక ప్రాచీ దేశాయ్. సంజయ్ దత్ తో కలిసి ప్రాచీ దేశాయ్ 'పోలీస్ గిరి' చిత్రంలో నటించింది. దీన్ని గొప్ప అవకాశంగా ప్రాచీ భావిస్తోంది. సంజయ్ దత్ జైలుకు వెళ్లకముందు నటించిన ఆఖరి చిత్రం 'పోలీస్ గిరి'. కాగా, సంజయ్ దత్ కు నిన్న సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. ముంబై బాంబు పేలుళ్ళ కేసులో తానిప్పటికే ఏడాదిన్నర జైలుశిక్ష అనుభవించానని, మరోసారి తన శిక్షను పునఃసమీక్షించాలని సంజయ్ దత్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News