: భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
ఖమ్మం జిల్లా భద్రచాలం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. నిన్న సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి రాత్రి నుంచి తిరిగి పెరగడం ప్రారంభమైంది. ఈ ఉదయానికి 53 అడుగుల ఎత్తుకు చేరింది. దీంతో, మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు భద్రాచలం డివిజన్ లోని వెంకటాపురం, చర్ల రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరదనీరు మూడు చోట్ల వారధులను ముంచెత్తడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.