: క్రెడిట్‌ కార్డులేకున్నా ఫేస్‌ వేల్యూ ఉంటే చాలు


మనం అప్పుడప్పుడూ సరదాగా మాట్లాడే సమయంలో అదేరా ఫేస్‌ వేల్యూ అంటే... అంటుంటాం. అయితే మన ఫేస్‌కు నిజంగానే వేల్యూని లెక్కకట్టేందుకు ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ రెడీ అవుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మనం బయటికి వెళ్లిన సమయంలో క్రెడిట్‌ కార్డు లేకున్నా కూడా మన ఫేస్‌ వేల్యూతో ఎంచక్కా మనం షాపింగ్‌ చేసేయొచ్చట. ఎందుకంటే ఈ కొత్త రకం సాఫ్ట్‌వేర్‌తో మన ఫేస్‌కు ఎంత వేల్యూ ఉంది అనే విషయాన్ని ఇట్టే చెప్పేయవచ్చట.

ఫిన్లాండ్‌కు చెందిన ఒక కంపెనీవారు మనుషుల ముఖాలను పసిగట్టి బ్యాంకు వ్యవహారాలను చక్కబెట్టే ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీంతో మనం జేబులో క్రెడిట్‌ కార్డు లేకున్నా చక్కగా మన ముఖారవిందాన్ని చూపించి షాపింగ్‌ చేసేయొచ్చట. ఇందుకు మనం చేయాల్సింది ఒక్కటే షాపింగ్‌ చేసిన తర్వాత బ్యాంకులో ఖాతాలున్న ఖాతాదారులు అక్కడి కెమెరాకేసి కాసేపు కళ్లప్పగించి చూస్తే చాలు. మన బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలకు బ్యాంకు అనుమతిచ్చేస్తుంది. ఒకవేళ మనుషులను పోలిన మనుషులు, కవలలు ఉంటేకూడా వారిని కూడా సునాయాసంగా ఈ సాఫ్ట్‌వేర్‌ గుర్తించేస్తుందట. అలా గుర్తించలేని క్లిష్టమైన పరిస్థితి వస్తే చక్కగా పిన్‌ నంబరును కూడా అడుగుతుందట. మొత్తానికి ఈ కొత్త రకం సాఫ్ట్‌వేర్‌ మన ఫేస్‌లకు కాస్తో కూస్తో వేల్యూ ఇస్తోంది!

  • Loading...

More Telugu News