: ఈ సిగరెట్లతో ప్రమాదమే


మామూలు సిగరెట్లు కాల్చితే ఆరోగ్యానికి ప్రమాదం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మామూలు సిగరెట్లతో పోల్చితే మెంథాల్‌ సిగరెట్లు మరింతగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తాయని అమెరికా ఆహార, ఔషధ సంస్థ ` ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది.

మామూలుగా ప్రజలు వాడే సిగరెట్లతో పోల్చితే మెంథాల్‌ సిగరెట్లతో వారి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచివుందని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. మంగళవారంనాడు విడుదల చేసిన స్వతంత్ర సమీక్షలో ఈ విషయాన్ని ఎఫ్‌డిఏ వెల్లడించింది. ఇలా ప్రజారోగ్యానికి హాని కలిగించే మెంథాల్‌ సిగరెట్లను మార్కెట్‌ నుండి ఉపసంహరిస్తే ప్రజారోగ్యానికి మరింత ప్రయోజనకరమని 2011లో ఎఫ్‌డీఏ సలహా సంఘం తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ సిగరెట్లు తాగేవారికి జబ్బులు, విషపదార్ధాల ముప్పు ఎక్కువగా ఉండదని తెలిపింది. ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన ఎఫ్‌డీఏ మెంథాల్‌ సిగరెట్లతో ప్రజారోగ్యానికి ముప్పు ఉందని పేర్కొన్న ఎఫ్‌డీఏ వీటిపై పరిమితులు విధించడం లేదా వీటిని పూర్తిగా నిషేధించడం చేయాలనే విషయానికి సంబంధించి ఎలాంటి సిఫారసులు చేయలేదు.

  • Loading...

More Telugu News