: మలేరియా నివారణకో కొత్త మందు
మలేరియా వ్యాధిని పూర్తిగా నివారించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిశోధనల్లో భాగంగా మలేరియా వ్యాధికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మందును కనుగొన్నారు. ఈ మందు మలేరియా వ్యాధి కారక బ్యాక్టీరియాను సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
ఆష్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఔషధ నిపుణుడు కెవిన్ సలిబా బృందం మలేరియా నివారణ కొరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో వీరు ఒక కొత్తరకం ఔషధాన్ని కనుగొన్నారు. మలేరియా వ్యాధి కారక పరాన్నజీవులు శరీరం నుండి విటమిన్ బి1 (థయమిన్)ను గ్రహించడం ద్వారా శక్తిని పొంది, విస్తరిస్తాయి. దీంతో మలేరియా బ్యాక్టీరియా థయమిన్‌ను గ్రహించి, దాన్ని జీర్ణం చేసుకుని శక్తిని పొందే మార్గాలపై కెవిన్ బృందం దృష్టి సారించింది. ఈ బ్యాక్టీరియా థయమిన్‌ను గ్రహించినా అది దానికి శక్తిగా మారకుండా అడ్డుకోవడం ద్వారా ఈ బ్యాక్టీరియాను బలహీనపరచవచ్చని వీరు కనుగొన్నారు. ఎలుకలపై వీరు చేసిన ప్రయోగాల్లో సమర్ధవంతంగా బ్యాక్టీరియాను బలహీనపరచగలిగారు. అయితే మరిన్ని ప్రయోగాల తర్వాత ఈ కొత్తరకం ఔషధాన్ని అందరికీ అందుబాటులోకి తేనున్నారు.