: ఇక మీ వారి గురించి చింత అనవసరం


ఏదైనా పనిమీద బయటికి వెళ్లిన మీ భర్త అసలు ఏం తిన్నాడో... ఏమో అనుకుంటూ మీరు ఇంట్లోనే ఉండి చింతపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీ భర్త ఎక్కడవున్నా అతను ఏం తింటున్నాడు అనే విషయాలను గమనించి అతనికి వేళకు అన్నీ గుర్తుచేసే ఒక కొత్త పరికరం వచ్చేసింది. అలాంటి ఒక కొత్తరకం పరికరాన్ని ఇప్పటికే ఒక దేశ ప్రధానమంత్రి భార్య ఉపయోగించేసి తన భర్త గురించి నిశ్చింతగా ఉన్నారట.

జాబోన్‌-యూపీ అనే అలారం లాంటి దాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పరికరం చేసే పనేమిటంటే అదొక హైటెక్‌ అలారం, అంటే సీసీటీవీ లాంటిదన్నమాట. ఇది మనం ఎప్పుడు ఏం చేయాలి అనే విషయాలను మనకు గుర్తు చేస్తుంది. మనం ఎప్పుడు అన్నం తినాలి, నీళ్లు ఎప్పుడు తాగాలి, నిద్రపోవడం ఎప్పుడు చేయాలి వంటి అన్ని విషయాలను ఇది రికార్డు చేస్తుంది. దాని ప్రకారం అది ఎప్పటికప్పుడు మన ఐపాడ్‌, ఫోన్‌లకు సమాచారం అందజేసేస్తుంది. చేతికి చుట్టుకునే వాచీలాగా ఉండే ఈ పరికరంతో మనవారు ఎక్కడున్నా ఇట్టే వారి గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేకుండా, వేళకు అన్నీ పనులు చేసేవిధంగా ఈ పరికరం చూసుకుంటుంది. మరి మనం నిశ్చింతగా ఉండొచ్చు.

అన్నట్టు జాబోన్‌ లేకుండా అసలు బయటికే వెళ్లవద్దని బ్రిటన్‌ ఆర్ధిక మంత్రి జార్జి ఓస్‌బోర్న్‌ భార్య మేడం ఫ్రాన్సిస్‌ ఆదేశాలు జారీ చేసేసిందట. మూడు సైజుల్లోను, ఆరు రంగుల్లోను లభించే ఈ జాబోన్‌ను ఒక్కసారి రీచార్జి చేస్తే చాలు, ఇక పదిరోజులపాటు నిరాటంకంగా ఇది పనిచేస్తుంది. ఆపిల్‌ లేదా ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఫోన్‌లలో ప్రత్యేక అప్లికేషన్‌కు దీన్ని అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News