: ఉద్యమాల ఖిల్లాలో టీఆర్ఎస్ హవా
ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పట్టు నిరూపించుకుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతిస్తున్న సర్పంచి అభ్యర్థుల్లో అత్యధికులు జయభేరి మోగించారు. వరంగల్ జిల్లాకు సంబంధించి, ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు 60 మంది నెగ్గగా.. టీడీపీ, కాంగ్రెస్ చెరో 33 మందిని గెలిపించుకున్నాయి. ఇక వైఎస్సార్సీపీకి 8 పంచాయతీలు దక్కాయి.