: టీమిండియాకు షాకిస్తాం: జింబాబ్వే కోచ్


తమను తక్కువ అంచనా వేయొద్దంటున్నాడు జింబాబ్వే జట్టు కోచ్ ఆండీ వాలర్. పర్యటన ఆరంభంలోనే భారత్ కు షాకిస్తామని హెచ్చరించాడు. హరారేలో మీడియాతో మాట్లాడుతూ, టీమిండియాతో పోరుకు తాము మెరుగ్గానే సన్నద్ధమయ్యామని వివరించాడు. తాజా వన్డే సిరీస్ కోసం తమ ఆటగాళ్ళు ఉత్సుకతతో ఉన్నారని చెబుతూ, భారత్ ప్రపంచ చాంపియన్ జట్టయినా తామేమీ భయపడబోమన్నాడు. కాగా, స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొంటారని పేరున్న భారత ఆటగాళ్ళను, తన లెఫ్టార్మ్ స్పిన్ తో పలుమార్లు ఇబ్బందులకు గురిచేసిన వెటరన్ బౌలర్ రేమాండ్ ప్రైస్ కు తుదిజట్టులో చోటు కల్పిస్తామని వాలర్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News