: రేపు హైదరాబాద్ లో సీమాంధ్ర మంత్రుల సమావేశం
తెలంగాణ ప్రకటనపై ఊహాగానాలు ఊపందుకున్న నేపధ్యంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సీమాంధ్ర మంత్రులు రేపు హైదరాబాద్ లో సమావేశం కానున్నారని ప్రాధమిక విద్యాశాఖా మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు చేయాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తామని అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు సమ్మెకు దిగుతామనడాన్ని స్వాగతించిన మంత్రి, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఉద్యోగులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్ర విభజన జరిగితే అందుకు సానుకూల నిర్ణయాలు ప్రకటించిన టీడీపీ, వైఎస్సార్సీపీ లే కారణమవుతాయని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు.