: ఆర్ బీఐ బోర్డు నుంచి వైదొలిగిన కెఎమ్ బిర్లా
ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) బోర్డు నుంచి వైదొలిగారు. ఈ మేరకు బిర్లా రాజీనామా చేశారు. ఆయన గ్రూపుకు చెందిన ఒక సంస్థ నెల రోజుల కిందట కొత్త బ్యాంకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో తలెత్తిన చిన్నపాటి వివాదాన్ని నివారించేందుకు బిర్లా.. ఆర్ బీఐ బోర్డు నుంచి బయటికి వచ్చారని కంపెనీకి చెందిన అధికార ప్రతినిధి వెల్లడించారు.