: మోడీకి వీసా ఇవ్వొద్దంటూ ఒబామాకు ఎంపీల లేఖ


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వీసా ఇవ్వొద్దంటూ పలువురు ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు పలువురు పార్లమెంటు సభ్యులు తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖలు రాశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే ఇకముందు కూడా కొనసాగించాలని కోరారు. మొత్తం 12 పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు ఒబామాకు ఈ లేఖ రేశారు.

ఇదే లేఖను 2012 నవంబర్ 26, డిసెంబర్ 5న కూడా పంపారు. దాన్నే ఈ ఆదివారం మళ్లీ ఫ్యాక్స్ చేశారు. ఈ లేఖపై 25 మంది రాజ్యసభ సభ్యులు, 40 మంది లోక్ సభ సభ్యులు సంతకం చేశారు. మోడీకీ వీసా నిరాకరణపై ఒకసారి పరిశీలించాలంటూ కొన్నిరోజుల కిందట బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అమెరికాను కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News