: గోదారి పరవళ్లకు కండెం జలాశయం 14 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండెం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో కండెం జలాశయానికి ఉన్న పధ్నాలుగు గేట్లను ఎత్తివేసి 1.4 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. దీంతో గూడెం సమీపంలోని గోదావరిపై ఉన్న వంతెన పూర్తిగా నీటమునిగింది. ఇది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న వంతెన కావడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.