: టాప్ గేర్లో దూసుకెళుతున్న 'సైకిల్'
సర్పంచి అభ్యర్థుల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దూసుకెళుతున్నారు. తొలి విడతలో భాగంగా మొత్తం 6566 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ జోరు కనబరిచింది. అధికార కాంగ్రెస్ ను వెనక్కినెడుతూ.. టీడీపీ 962 సర్పంచి పదవులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 863 పంచాయతీల్లో తన మద్దతుదారులను గెలిపిచుకోగలిగింది. ఇక వైఎస్సార్సీపీకి 649, టీఆర్ఎస్ కు 176, వామపక్షాలకు 31, ఇతరులకు 581 పంచాయతీలు దక్కాయి. ఇంకా 3277 పంచాయతీల ఫలితాలు తెలియాల్సి ఉంది.